బొబ్బిలి: ప్రతిరోజు కాలువలను శుభ్రపరిచే బాధ్యత కార్మికులదే: కమిషనర్ ఎం.రామలక్ష్మి
బొబ్బిలి ప్రతిరోజు కాలువలను శుభ్రపరిచే బాధ్యత కార్మికులదే అని కమిషనర్ ఎం రామలక్ష్మి ఉన్నారు. బొబ్బిలి చివర ప్రాంతాలైన కాకి వీధి, రెల్లి వీధి, టివిఆర్ పాత బొబ్బిలిలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె ఆ వీధుల్లో ఉన్న కాలువలు, మురుగు నీరును పరిశీలించింది. నిలువ ఉన్న మురుగు చెత్తాచెదారాలు ప్రతిరోజు తీయడం, శుభ్రపరిచే బాధ్యత కార్మికులదేనని అన్నారు. కాలువలో మురుగునీరు చెత్త ఎక్కడ కనిపించినా కార్మికులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.