పీలేరులో రెండు ద్విచక్ర వాహనాలు డీ కొని ఇద్దరికీ తీవ్ర గాయాలు.
పీలేరు మండలం పీలేరు పట్టణంలోని పీలేరు చిత్తూరు రోడ్లో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా డీకొని ఇద్దరు తీవ్రంగా గాయపడిన సంఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది. పీలేరు పట్టణం ఇందిరమ్మ కాలనీ లో నివాసముంటున్న మునీశ్వర మేస్త్రి పని నిమిత్తం ఇందిరమ్మ కాలనీ నుంచి పీలేరు కు వస్తుండగా, అదే విధంగా నారాయణ స్కూల్ లో పనిచేస్తున్న రాజీవ్ నగర్ కాలనీకి చెందిన యాసిన్ ఎంజె ఆర్ కాలేజ్ వైపు నుంచి పీలేరు వైపు వస్తూ ప్రయివేటు పారిశ్రామిక శిక్షణా కేంద్రం (ఐటిఐ ) దగ్గర రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని, మేస్త్రి మునీశ్వరకు కుడి కాలు, యాసిన్ కు కుడి చేయి విరిగి తీవ్రంగా గాయప్డారు