ఇబ్రహీంపట్నం: మియాపూర్ డివిజన్లో స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్న కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
మియాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీవాసులు కాలనీలో పలు సమస్యలు చేపట్టవలసిన అభివృద్ధి పనులపై కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్‌ను మంగళవారం మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు కాలనీలో సీసీ రోడ్లు వీధిలైట్లు పనిచేయకపోవడం పారిశుద్ధ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో వీటిని తక్షణం పరిష్కరించాలని కార్పొరేటర్ ను కోరారు. కార్పొరేటర్ మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించి అధికారులతో చర్చించి త్వరలో చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు.