దర్శి: అక్టోబర్ 28వ తేదీన ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ
Darsi, Prakasam | Oct 17, 2025 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో అక్టోబర్ 28వ తేదీన ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీ చేపడుతున్నట్లు వైసీపీ జిల్లా అధ్యక్షులు మరియు ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వైసిపి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వమే మెడికల్ కళాశాలల నిర్మాణం చేపట్టాలని ఎమ్మార్వో కు వినతి పత్రం అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అంశంపై నవంబర్ 12వ తేదీ జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం ఉన్నట్లు తెలిపారు.