ఐదు రూపాయలకే షర్ట్- షాప్ యజమానిని పోలీస్ స్టేషన్ కు తరలింపు
రాజంపేట పట్టణ ఆర్ఎస్ రోడ్లు ఓ పట్టణ షాపు వార్షికోత్సవం సందర్భంగా సదరు యజమాని 5 రూపాయలకే షర్ట్ ఇస్తామని ప్రకటించాడు. సంబంధిత రీల్ వైరల్ కావడంతో ఆదివారము ఉదయం ఆ షాప్ వద్దకు యువకులు భారీగా చేరుకున్నారు. ఆ రోజులు ట్రాఫిక్ జామ్ అయి వాహనాల రాకపోకులకు అంతరాయం ఏర్పడింది. ముందస్తు అనుమతులు తీసుకోకుండా ఇలా చేయడం వల్ల యజమానిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.