భూపాలపల్లి: ఇసుక ట్రాక్టర్ - తవేరా వాహనం ఢీ.. ఏడుగురికి స్వల్ప, ముగ్గురికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు
ఇసుక ట్రాక్టర్ తవేరా వాహనం ఢీకొన్న ఘటనలో ఏడుగురికి స్వల్ప ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బాంబులగడ్డ సమీపంలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకున్నట్లు స్థానికులు, పోలీసుల ద్వారా రాత్రి 9:30 గంటలకు తెలిసింది. పరకాల వైపు నుంచి కాలేశ్వరం వైపు వెళ్తున్నటువంటి వాహనం మార్గం మధ్యలో బాంబులగడ్డ సమీపంలో ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో నల్లబెల్లి మండలానికి చెందిన శ్రీకాంత్ రెడ్డికి, ములుగు జిల్లా కేంద్రానికి చెందిన మేదరి సారమ్మ, వీర్ల రాజులు తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం వారిని మంద పడకల ఆసుపత్రికి తరలించారు. ప్రమాద పరిస్థితిని భూపాలపల్లి పోలీసులు పరిశీలించారు.