ఆలూరు: బాలికల ఎస్సీ సాంఘిక సంక్షేమ వసతి గృహంలో అదనపు గదుల కొరకు నిధులు కేటాయించి సమస్యలు పరిష్కరించాలి: ఎస్ఎఫ్ఐ
Alur, Kurnool | Sep 17, 2025 ఆలూరు నియోజకవర్గ కేంద్రంలో బాలికల సాంఘిక సంక్షేమ గృహంలో అదనపు గదులు ఏర్పాటు చేయాలని, ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్ష కార్యదర్శులు బసవరాజు మండల విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేయడం జరిగిందని బుధవారం తెలిపారు. ప్రతి సంవత్సరం విద్యార్థినిలు సంఖ్య గణనీయంగా పెరుగుతూ ప్రస్తుతం 200 మంది విద్యార్థులు ఉంటున్నారు. వందమంది విద్యార్థినిల సంఖ్యకు నిర్మించిన ఈ వసతి గృహంలో 200 మంది విద్యార్థులు సరిపోవడంలేదని, చాలా అవస్థలు పడుతున్నారు. వసతి గృహానికి ఎదురుగా బళ్లారి ప్రధాన నూతన రహదారి వేశారన్నారు.