మేడ్చల్: ఉస్మానియా యూనివర్సిటీలో ఆపదమిత్ర పథకం వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ప్లాటినం జూబ్లీ హాల్ లో జరిగిన ఆపదమిత్ర పథకం వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పాల్గొని మాట్లాడారు. ఎన్డీఎంఏ ప్రారంభించిన యువ ఆపదమిత్ర పథకంలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు భాగస్వామ్యం అవడం ఎంతో శుభ పరిణామం అని అన్నారు. తోటి వారిని కాపాడేందుకు తీసుకుంటున్న శిక్షణలో భాగమైనందుకు అందరిని కమిషనర్ అభినందించారు. పరిసరాల పట్ల అవగాహన ఉన్నప్పుడే వరదలు, అగ్ని ప్రమాదాలు ఇలా ఆపద సమయంలో తోటి వారిని కాపాడగలమన్నారు. ప్రాణ, ఆస్తి నష్ట నివారణలో భాగస్వామ్యం అవుతున్నందుకు మీరు ఎంతో గర్వపడాలన్నారు.