రాష్ట్రంలో యూనివర్సిటీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి,అధ్యక్షుడిగా తిమ్మప్ప ఏకగ్రీవంగా ఎన్నిక
Anantapur Urban, Anantapur | Sep 14, 2025
రాష్ట్రంలోని యూనివర్సిటీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తామని ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు తిమ్మప్ప పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ న్యూ కోర్స్ బిల్డింగ్ లోని సెమినార్ హాల్లో ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీల నాన్ టీచింగ్ ఉద్యోగుల ఎన్నికలు నిర్వహించారు.ఎన్నికల అధికారి అధికారిగా శ్రీధర్ గుర్రంకొండ వ్యవహరించారు. ఏకగ్రీవంగా జరిగిన ఈ ఎన్నికలలో ఆల్ యూనివర్సిటీస్ నాన్ టీచింగ్ అధ్యక్ష ఎన్నికలలో శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి తిమ్మప్ప అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.