హిమాయత్ నగర్: ఖైరతాబాద్ బస్తీ దావకానను పరిశీలించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి కేటీఆర్
ఖైరతాబాద్ బస్తీ దావకానను మాజీ మంత్రి కేటీఆర్ మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ ఉన్న మహిళ డాక్టర్లతో మాట్లాడి వారి సమస్యలను అక్కడ అందుతున్న వైద్య సేవలను గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళ డాక్టర్లు మాజీ మంత్రి కేటీఆర్ తో తమకు గత నాలుగు నెలలుగా జీతాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జీతాల విషయంలో తమను ఇబ్బందులకు గురి చేస్తుందని తెలపడంతో స్పందించిన కేటీఆర్ ప్రభుత్వంతో పోరాడి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు.