కదిరిలో ఘనంగా హిందీ భాషా దినోత్సవం
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని ఎస్ టి ఎస్ ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ స్మిత ఆధ్వర్యంలో హిందీ భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూపురం కళాశాల అధ్యాపకులు యశోద ముఖ్య అతిథిగా పాల్గొని హిందీ భాషా ప్రాముఖ్యతను వివరించారు. హిందీ భాష కోసం కృషి చేసిన వారి సేవలను కొనియాడారు.