ప్రస్తుత వేసవిలో జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా పటిష్టమైన ప్రణాళిక రూపొందించాం: CSతో వీసీలో కలెక్టర్ ప్రసన్న వెంకటేష్
Eluru, Eluru | Apr 1, 2024 ఏలూరు జిల్లాలో ప్రస్తుత వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా పటిష్టమైన ప్రణాళిక రూపొందించుకుని, అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్ రెడ్డికి తెలిపారు. సోమవారం రాష్ట్ర సెక్రటేరియట్ నుండి సీఎస్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వేసవిలో తాగునీటి సరఫరా, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై సీఎస్ పలు సూచనలు చేశారు.