పరిగి: భారీ వర్షంతో పరిగి పట్టణంలో జలమయమైన రోడ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పట్టణవాసులు వాహనదారులు
పెడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నేడు శుక్రవారం 9 గంటలకు పరిగి పట్టణంలోని పలు కాలనీలలో భారీగా నీరు నిలవడం జరిగింది. ప్రధానంగా బీజాపూర్ నేషనల్ హైవేపై వర్షపు నీరు భారీగా నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చుట్టుపక్కల గల వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అధిక వర్షాలతో కాలనీలో రోడ్లు జలమయం కావడంతో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. ఇప్పటికే అధికారులు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.