సీఎం చంద్రబాబు ముందు చూపు వల్ల రాష్ట్రం పెద్ద విపత్తు నుంచి బయటపడిందని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. సింగరాయకొండ మండలంలో ఆయన వరద బాధితులను పరామర్శించి మాట్లాడారు. ప్రాణ నష్టం జరగకుండా ముందు చూపుతో కాపాడుకోగలిగామన్నారు. ఎంతో అనుభవజ్ఞుడైన చంద్రబాబు సాంకేతికత పరిజ్ఞానం ఉపయోగించి ఎక్కడికక్కడ సమస్యలను అధిగమించగలిగారన్నారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.