రెబ్బెన మండలం నంబాల గ్రామ శివారులో ఆదివారం సాయంత్రం పేకాట ఆడుతున్నారని వచ్చిన సమాచారం మేరకు రెబ్బెన ఎస్సై వెంకట కృష్ణా, పోలీస్ సిబ్బందితో కలసి దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 5 గురిని పట్టుకొని వారి వద్ద నుండి రూ.1,330 నగదుతో పాటు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని 5గురుపై గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వెంకట కృష్ణ తెలిపారు.