గుంతకల్లు: తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: గుత్తిలో జిల్లా ఎస్పీ జగదీష్
పోలీస్ సంస్కరణ దినోత్సవం రోజు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నిజాయితీగా పనిచేస్తున్న ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై బెదిరించే ధోరణిలో దుర్భాషలాడడం చాలా తప్పని అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ జగదీష్ చెప్పారు. గుత్తి పోలీస్ స్టేషన్ ను బుధవారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఆయన సాయంత్రం 6 గంటల సమయంలో మీడియాతో మాట్లాడారు. విలేకరులు జేసీ ఘటన గురించి అడిగారు. అందుకు ఆయన స్పందిస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎవరిని మినహాయించే ప్రసక్తే లేదన్నారు.