జగిత్యాల: జాతీయ రహదారుల భూ సేకరణ పురోగతిపై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
జాతీయ రహదారుల నిర్మాణానికి గడువులోగా భూ సేకరణ పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ లను, సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటల ప్రాంతంలో సుమారు రెండుగంటలపాటు సుదీర్ఘంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర సిఎస్ కె.రామ కృష్ణ రావు లతో కలిసి జాతీయ రహదారుల నిర్మాణం పై జిల్లా కలెక్టర్ లతో సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జగిత్యాల సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్...