రాయదుర్గం పట్టణంలోనీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రహరి, ఇతర పనులను త్వరగా పూర్తి చేయించాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీకి రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. విజయవాడలో శుక్రవారం ఆయన ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ హరి జవహర్ లాల్ ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలోనే అత్యంత ప్రాచీనమైన ఆలయాలలో ఒకటైన ఈ గుడిని మన రాష్ట్ర ప్రజలే కాక ఇతర రాష్ట్రాల భక్తులు కూడా అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారనీ వివరించారు. ఆలయ ప్రాకార నిర్మాణం కోసం గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం రూ.2.65కోట్లు మంజూరు చేసిందన్నారు.