కొత్తగూడెం: కార్మికుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి: సింగరేణి సిఎండి బలరాం
బుధవారం సింగరేణి అన్ని ఏరియాలో పర్సనల్ విభాగాల అధికారులతో మధ్యాహ్నం మూడు గంటలకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సింగరేణి సిఎండి బలరాం, డైరెక్టర్ పా గౌతమ్. ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యం సాయంత్రం 8 గంటలకు ఒక ప్రకటనలో తెలిపింది. అనంతరం వారు మాట్లాడుతూ కార్మికులకు సంబంధించిన సమస్యలు జాప్యం చేయకుండా సత్వరమే పరిష్కరించాలని విధులకు గైర్హాజరయ్యే కార్మికులను సక్రమంగా విధులకు హాజరయ్యేలా కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆదేశించారు.