రంపచోడవరం: దేవీపట్నం మండలంలో ఉగ్రరూపం దాల్చిన గోదావరి వరద, మునిగిపోయిన పొలాలు రోడ్లు, ఆలయాలు
అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలో గోదావరి వరద ఉగ్రరూపం దాల్చింది. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రధాన రోడ్లు, పొలాలు పూర్తిగా మునిగిపోవడంతో పాటు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి పోచమ్మ తల్లి అమ్మవారి ఆలయం సగానికి పైగా మునిగిపోయిందని దేవస్థానం లక్ష్మీ కుమార్ తెలిపారు. అమ్మవారి ఆలయానికి ఎవరూ రావద్దని దర్శనాలు నిలిపివేసినట్లు తెలిపారు. అమ్మవారి ఆలయానికి రావడానికి మార్గం లేదని, అన్ని వైపులా గోదావరి వరద చుట్టుముట్టిందని ఈవో చెప్పారు . ప్రస్తుతం దేవీపట్నం మండలంలో గోదావరి వరద అత్యంత ప్రమాదకర రీతిలో ప్రవహిస్తుందని తెలిపారు.