ఓజోన్ దే సందర్భంగా పరిగిలో విద్యార్థులు ర్యాలీ
శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలంలోని ఏఎం లింగన్న సేవమందిరం పాఠశాల విద్యార్థులతో మంగళవారం మధ్యాహ్నం ఓజోన్ డే సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. కాలుష్యం పెరగడంతో ఓజోన్ పొర నాశనమవుతోందని ఉపాధ్యా యులు పేర్కొన్నారు. మొక్కలు నాటి, వాటిని సంరక్షించి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.