పులివెందుల: గత పాలకుడు బావమరిది కళ్ళల్లో ఆనందం చూసేందుకే కడపలో ఆర్కిటెక్చర్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు : MLC రాంగోపాల్ రెడ్డి
Pulivendla, YSR | Sep 23, 2025 కడప ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ కి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి అనుమతులు తీసుకుని యూనివర్సిటీకి తగిన గుర్తింపు తీసుకురావాలని మండలిలో పులివెందుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కోరారు. గత పాలకుడు బావమరిది కళ్ళల్లో ఆనందం చూసేందుకే కడపలో ఆర్కిటెక్చర్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి విద్యార్థుల జీవితాన్ని వారి భవిష్యత్తును నాశనం చేశాడని చెప్పారు. ఒక ప్రైవేట్ పణంలో యూనివర్సిటీని నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.