నగిరిపల్లి గ్రామంలో ప్రజా సమస్యల పై ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే నల్లారి కిషోర్
ప్రజా సమస్యల పరిష్కారమే ద్యేయంగా ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన కలికిరి మండలం పత్తేగడ పంచాయతీ నగిరిపల్లి గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పీలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు నుంచి సమస్యల పై వచ్చిన అర్జీలను స్వీకరించారు. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. అధికారులకు తెలియజేసి సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.