బజార్హత్నూర్: పిప్పిరి గ్రామంలో ఈనెల 7న ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పర్యటన, ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా
ఈనెల 7న డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క బజార్హత్నూర్ మండలం పిప్పిరి గ్రామానికి రానున్న సందర్భంగా హెలిప్యాడ్, సభా స్థలం, పార్కింగ్, తదితర ఏర్పాట్లను అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు.రోడ్ల నిర్మాణానికి , వాంకిడి సబ్ స్టేషన్కు , పిప్పిరి గ్రామంలో అభివృద్ది కార్యక్రమాలకు ఉపముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు.ఆనంతరం ఎస్సీ కార్పోరేషన్, ట్రైకార్, ఐటీడీఏల ద్వారా మంజూరైన బ్యాంకు లీంకేజీ చెక్కులను పంపిణీ చేస్తారని ఆయన పేర్కొన్నారు.