తాడిపత్రి: తాడిపత్రిలో వెలసిన శ్రీ వేదమాత గాయత్రి దేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన జెసి ప్రభాకర్ రెడ్డి దంపతులు
తాడిపత్రి పట్టణంలోని సంజీవ్ నగర్ లో వెలసిన శ్రీ వేదమాత గాయత్రీ దేవి అమ్మవారి ఆలయంలో మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. దసరా నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారిని జేసీ ప్రభాకర్ రెడ్డి దంపతులు దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి దంపతులు వస్త్రాలను అందించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు జెసి ప్రభాకర్ రెడ్డి దంపతులను సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు.