ఈరోజు సీన్ ఒకలా ఉంది,రేపు సీన్ రివర్స్ అయితే ఇబ్బందులు తప్పవని వైసిపి జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి హెచ్చరించారు. అధికారం శాశ్వతం కాదని చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమన్నారు చట్టపరంగా వస్తే పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేశారు. సోమవారం విజయ పాల డైరీ విషయంలో ఆయన ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి తో కలిసి నంద్యాలలో మీడియా సమావేశం నిర్వహించారు