నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండల కేంద్రంలోని ఏపీ మోడల్ స్కూల్ హాస్టల్లో విద్యార్థి ఆత్మహత్యకు కారణమైన వార్డెన్ ను సస్పెండ్ చేయాలని, నంద్యాల జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మంత్రి కమిటీ మెంబర్ లింగాల నాగరాజు గురువారం డిమాండ్ చేశారు, విద్యార్థి ఆత్మహత్య గల కారణాలను గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ అధికారులు విచారణ చేసి వెల్లడించాలని కోరారు, ఇలాంటి ఘటనలు పురావతం కాకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు, ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ మరియు లోకాయుక్త మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని లింగాల నాగరాజు అన్నారు