మంత్రులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా దీపావళి వేడుకలు
Ongole Urban, Prakasam | Oct 20, 2025
ప్రకాశం జిల్లాకు చెందిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మరియు మంత్రి సిద్ధ రాఘవరావు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ సోమవారం సాయంత్రం వారి వారి నివాసాలలో కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా దీపావళి వేడుకలను నిర్వహించారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ స్వామి టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని తన నివాసంలో బాణాసంచా కాలుస్తూ దీపావళి వేడుకలను కుటుంబ సభ్యులు మరియు అధికార యంత్రాంగం తో కలిసి నిర్వహించారు మంగమూరు రోడ్ లోని తన నివాసంలో, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ బికే అపార్ట్మెంట్లో కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు