కళ్యాణదుర్గం: పాల వెంకటాపురం లో కొల్లాపూరమ్మ జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన వైసీపీ ఫ్లెక్సీలు చించివేత, పోలీసులకు ఫిర్యాదు
బ్రహ్మసముద్రం మండలం పాల వెంకటాపురం లో శుక్రవారం జరుగునున్న కొల్లాపూరమ్మ జాతర సందర్భంగా టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు వైసీపీ ఫ్లెక్సీలను చించి వేశారు. టీడీపీ ఫ్లెక్సీలను అలాగే ఉంచారు. దీంతో వైసీపీ కార్యకర్తలు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు అలాగే ఉండడం తమ ఫ్లెక్సీలను మాత్రమే చించి వేయడంలో ఆంతర్యం ఏమిటని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.