జమ్మలమడుగు: బద్వేల్ : పట్టణంలో ఓ జి సినిమా హంగామా.. జనసేన నాయకుల ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ఊరేగింపు
కడప జిల్లా బద్వేలు పట్టణంలో బుధవారం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ఓజి సినిమా విడుదల నేపథ్యంలో జనసేన పార్టీ నాయకులు, మరియు బద్వేలు బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. పట్టణంలోని నాలుగు రోడ్ల వెంట డీజే లతో, భారీగా బాణాసంచా కాల్చుతూ, పలు వాహనాలకు జనసేన జెండాలను ఏర్పాటు చేసుకొని, రంగులు చల్లుకుంటూ భారీగా ఊరేగింపు నిర్వహించారు. జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ ఊరేగింపులో పెద్ద ఎత్తున పాల్గొని నినాదాలు చేశారు. ఈ ఊరేగింపు పట్టణంలోని ఎస్ఎల్ఎన్ సినిమా థియేటర్ వరకు కొనసాగింది.