తాడిపత్రి: నగురూరు గ్రామంలోని పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడులు, 9 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్, నాలుగు బైకులు సీజ్
యాడికి మండల పరిధిలోని నగరూరు గ్రామంలోని ఓ పేకాట స్థావరం సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పోలీసులు మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో అక్కడ పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2,810 నగదు తో పాటు నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై సీఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.