దీపావళికి పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి పెద్దిరెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చిన్న పొరపాటు జరిగిన ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరు జాగ్రత్తగా దీపావళి పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం తెలియజేయాలని సకాలంలో స్పందించి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.