పెనమలూరు: కంకిపాడులో తప్పిపోయిన చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన శక్తి టీమ్
తన వివరాలు సరిగ్గా చెప్పలేని 5 ఏళ్ల చిన్నారిని శక్తి టీమ్ సభ్యులు చాకచక్యంగా గుర్తించి, సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. కంకిపాడు రోడ్డుపై వెళ్తుండగా అక్కడే విధుల్లో ఉన్న శక్తి టీమ్ సిబ్బంది ఆ చిన్నారిని గమనించారు. విచారించగా పాప ఊరు కంకిపాడు అని, అమ్మమ్మ ఇంటి నుంచి అమ్మ ఇంటికి వెళ్తున్నానని తెలిపింది. అక్కడ ఒక యువకుడు చిన్నారి వివరాలు తెలపడంతో ఎస్ఐ సందీప్ శుక్రవారం సాయంత్రం తల్లిదండ్రులకు అప్పగించారు.