గోకవరంలో గ్రీవెన్స్‌కు ఒక దరఖాస్తు
గోకవరం మండలం తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఒక దరఖాస్తు వచ్చినట్లు తహశీల్దార్ పినిశెట్టి రామకృష్ణ తెలిపారు. గోకవరం మేజర్ గ్రామపంచాయతీకి చెందిన మహమ్మద్ శాంతి అనే మహిళ తన స్థలంలో ఇల్లు కట్టుకోకుండా కొంతమంది వ్యక్తులు అడ్డుపడుతున్నారని దరఖాస్తు అందజేసినట్లు తహశీల్దార్ అన్నారు.