బ్రహ్మసముద్రం మండలం బొమ్మగాని పల్లిలో ఆదివారం మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించారని ఆ గ్రామ సర్పంచ్ ఆదినారాయణ రెడ్డి తో పాటు మరో 5 మందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పోలీస్ స్టేషన్ వద్ద ఉదయం నుంచి ఉద్రిక్తత నెలకొనింది. సోమవారం సాయంత్రం భారీ పోలీసు బందోబస్తు మధ్య వైసీపీ నాయకులను కళ్యాణ దుర్గం డీఎస్పీ ఆఫీసుకు తరలించారు. కోర్టులో హాజరుపరచగా జడ్జి బెయిల్ మంజూరు చేశారు.