ఒంగోలు: ఒంగోలు నగరంలో ఘనంగా ఆడికృతిక వేల్ కావడి మహోత్సవాలు - సూలాలను శరీరాన్ని గుచ్చుకొని మొక్కులు తీర్చుకున్న భక్తులు
ఆడికృతిక వేల్ కావడి మహోత్సవాలను ఒంగోలు నగరంలో ఘనంగా నిర్వహించారు. కేశవస్వామి పేటలోని కాశీవిశ్వేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఉత్సవాలు ప్రారంభయ్యాయి. ముందుగా వల్లి దేవసేన సమేత సుబ్రమణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పాలకావడులు సమర్పించారు. అనంతరం ఒంగోలు నగరంలో నగరోత్సవాన్ని కనుల పండుగ నిర్వహించారు. సూలాలను శరీరానికి గుచ్చుకుని మొక్కులు తీర్చుకున్నారు. కేశవస్వామి పేట నుంచి స్కందగిరిలో సుబ్రమణ్యేశ్వర స్వామి దేవస్థానం వరకు నగరోత్సవం నిర్వహించారు. నగర ఉత్సవానికి తిలకించేందుకు భక్తుల సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులయ్యారు.