కుప్పం: కుప్పంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఉపాధ్యాయ సంఘం నేతలు
ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రభుత్వం DA ప్రకటించడంతో ఆదివారం కుప్పంలో ఉపాధ్యాయులు సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దీపావళి కానుకగా ప్రభుత్వం DA ప్రకటించడం పట్ల ఉపాధ్యాయ సంఘ నేతలు కేశవులు, రాజేశ్వర కుమార్, శ్రీరాములు సురేంద్రబాబు, నారాయణస్వామి తదితరులు ఆనందం వ్యక్తం చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.