దర్శి: తూర్పు గంగవరంలో కోతి దాడితో మహిళ చేతికి గాయం
Darsi, Prakasam | Sep 17, 2025 ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఓ మహిళ ఇంటి బయటకు రాగా ఆమెపై కోతులు దాడి చేశాయి. దీంతో ఆమె చేతికి గాయమైంది. ప్రజలు బయటికి రావాలంటేనే భయాందోళన గురవుతున్నారు. అధికారులకు తెలియజేసినప్పటికీ చర్యలు తీసుకోలేదు అన్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.