రాష్ట్రంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నగిరిమడుగు గ్రామంలో కోటి సంతకాల సేకరణ చేపట్టిన మాజీ ఎమ్మెల్యే చింతల
రాష్ట్రంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వాల్మీకిపురం మండలం నగిరిమడుగు గ్రామంలో ఆదివారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 17వైద్య విద్య కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రయివేటీకరణ చేస్తున్న నేపథ్యంలో అందుకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నగిరి మడుగు గ్రామంలో నేడు చేపట్టినట్లు తెలిపారు. మెడికల్ కాలేజీ లను ప్రైవేటీకరణ చేయడం ద్వారా పేద మధ్యతరగతి ప్రజలు ఏ విధంగా నష్టపోతారో వివరించారు.