ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో ఆదివారం సినీనటి యాంకర్ అనసూయ సందడి చేశారు నగరంలోని స్వాతి షాపింగ్ మాల్ మూడో వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక అతిథిగా హాజరైన అనసూయ ఒంగోలు ప్రజలకు తాను రుణపడి ఉంటాను అన్నారు షాపింగ్ మాల్‌ను తానే ప్రారంభించారని మూడో వార్షికోత్సవానికి రావడం తనకు ఒక అవార్డు వచ్చిన ఆనందాన్ని కలిగిస్తుంది అన్నారు ఒంగోలు రావడం తనకు ఎంతో ఆనందకరమని ఒంగోలు ఎప్పుడు వచ్చినా తనకు ఎంతో సంతోషంగా ఉంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు షాపింగ్ మాల్‌ను ప్రత్యేకంగా ప్రారంభించిన అనంతరం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ షాపింగ్ మాల్గు సంబంధించిన పలు అంశాలను గురించి మాట్లాడింది