పలమనేరు: మున్సిపాలిటీలోని 26 వార్డుల్లో వైసీపీ గెలిస్తే గుండు గీసుకుంటా అంటూ సవాల్ విసిరిన - పట్టణ తెలుగుదేశం అధ్యక్షుడు కుట్టి
పలమనేరు: వైఎస్ఆర్సిపి నాయకులు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ప్రెస్మీట్ నిర్వహించిన విషయం విధితమే దానిని తీవ్రంగా ఖండించారు తెదేపా నేతలు. పార్టీ అధ్యక్షుడు కుట్టి మాట్లాడుతూ, మున్సిపాలిటీలోని 26 వార్డుల్లో వైఎస్ఆర్సిపి పార్టీ గెలిస్తే గుండుగీయించుకుంటానంటూ సవాల్ విసిరారు. టిడిపి పట్టణ కార్యదర్శి గిరిబాబు మాట్లాడుతూ, ఆనాడు వైసిపి పార్టీ అధికార దుర్వినియోగం చేసింది అధికారులను చేతులో పెట్టుకొని ఇష్టానుసారం వ్యవహరించారు ఇప్పుడున్నది కూటమి ప్రభుత్వం మీ పప్పులు ఉడకవు అంటూ పలు విమర్శలు చేశారు.