నల్గొండ: రాజ్నాథ్ సింగ్ అబద్ధాల ప్రచారాలు మాని అమరవీరుల గ్రామాలను సందర్శించాలి:సిపిఎం పొలిటి బ్యూరో మాజీ సభ్యురాలు బృందాకరత్
నల్లగొండ జిల్లా: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభను నల్గొండ పట్టణంలోని సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పొలిటి బ్యూరో మాజీ సభ్యురాలు అఖిల భారత నాయకురాలు బృందాకరత్ మాట్లాడుతూ రాజ్నాథ్ సింగ్, అబద్ధాల ప్రచారాలను ఆపి అమరవీరుల గ్రామాలను సందర్శించాలని తెలిపారు. భారతదేశ చరిత్రలో సెప్టెంబర్ 17 లిఖించబడిందని తెలిపారు .భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వస్తే ,హైదరాబాద్ సంస్థనానికి సెప్టెంబర్ 17న 1948 నాడు ఇండియన్ యూనియన్లు విలీనమైందన్నారు.