అవనిగడ్డ: మచిలీపట్నంలో లైంగిక వేధింపుల నిషేధిత బోర్డు ఆవిష్కరించిన కలెక్టర్
మచిలీపట్నం లో పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు నిషేధిత చట్టం అమలు చేసిన రోజు కావడంతో లైంగిక వేధింపులు నిషేధిత బోర్డును జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ సోమవారం ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ, పని ప్రదేశంలో మహిళలకు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయడంతో మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు పొందే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ అన్నారు. పని ప్రదేశంలో మహిళల రక్షణ కోసం జిల్లా వ్యాప్తంగా కమిటీని ఏర్పాటు చేశామని అన్నారు.