డంపింగ్ యార్డ్ రహిత రాష్ట్ర సాధనే లక్ష్యం:, మంత్రి నారాయణ
డంపింగ్ యార్డు రహిత రాష్ట్ర సాధనే లక్ష్యం గా ముందుకు వెళ్తున్నామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. బుధవారం విజయవాడ నగరంలో స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటి రోడ్లను శుభ్రం చేశారు. అమృత 2.0 పనులను త్వరలో ట్రేడర్లకు పిలుస్తామని తెలిపారు. స్వచ్ఛభారత్ సహకారంతో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.