లింగారెడ్డి పాలెం కి చెందిన అదృశ్యమైన యువకుడి మృతదేహం లభ్యం
Machilipatnam South, Krishna | Sep 16, 2025
కోడూరు మండల పరిధిలోని లింగారెడ్డిపాలెం గ్రామానికి చెందిన కంతేటి నాగ వెంకట శ్రీనివాసరావు (28) ఉల్లిపాలెం బహిర్భూమికి వెళ్ళి కృష్ణా నదిలో మునిగి గల్లంతయ్యాడు. కోడూరు ఎస్సై చాణిక్య ఆధ్వర్యంలో కృష్ణా నదిలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలచే గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం కృష్ణా నదిలో మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.