ప్లాస్టిక్ కవర్ల విక్రయాలు చెప్తే చర్యలు తప్పవు బనగానపల్లె ఈవో సతీష్ కుమార్ రెడ్డి
నంద్యాల జిల్లా బనగానపల్లెలో ప్లాస్టిక్ కవర్ల విక్రయాలు జరిపితే చర్యలు తీసుకుంటామని ఈవో సతీశ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం పట్టణంలోని కూరగాయల మార్కెట్ వ్యాపార సముదాయాల్లో ఆయన తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ప్లాస్టిక్ కవర్లు విక్రయాలు జరుపుతున్న ముగ్గురు వ్యాపారులపై జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు. ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయం అందుబాటులోకి తీసుకొచ్చామని, వ్యాపారులు వాటిని వినియోగించాలని సూచించారు.