నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని ఆర్ జంబులదిన్నె గ్రామంలో 22వ నెంబర్ రేషన్ దుకాణాన్ని మంగళవారం తాసిల్దార్ ప్రసాద్ బాబు సీజ్ చేశారు, డీలర్ ప్రసాద్ రెడ్డి సరుకులు సక్రమంగా పంపిణీ చేయడం లేదని ఫిర్యాదుతో తనిఖీలు చేపట్టారు, విచారణలో 11.6 క్వింటాళ్ల బియ్యం, 105 ప్యాకెట్ల చక్కెర, 225 కేజీల జొన్నలు అదనంగా ఉన్నట్లు గుర్తించారు, నివేదికను తదుపరి చర్యల కోసం ఆర్డీవోకు పంపినట్లు తాసిల్దార్ ప్రసాద్ బాబు తెలిపారు, ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు