ఈసీఐఎల్ లో సిపిఐ బస్సు జాతకు ఘనస్వాగతం లభించింది. బాసర నుంచి ప్రారంభమైన శతవసంతాల ముగింపు జాత అంబేద్కర్ చౌరస్తా చేరుకోగా నాయకులు పూలమాలతో స్వాగతం పలికారు. సభలో విఎస్స బోసు, పశ్య పద్మ మాట్లాడుతూ దేశంలో మతోన్మాద శక్తులను ఎదుర్కొనేందుకు కమ్యూనిస్టులే ప్రత్యామ్నాయమన్నారు. విద్యార్థి, యువజన, కార్మిక వర్గాల సమస్యలపై ఉద్యమాలు కొనసాగిస్తామని నేతలు తెలిపారు.