బొబ్బిలి: బొబ్బిలి వేసవి కళ నైపుణ్య శిక్షణ తరగతులకు ఆహ్వానం... నిర్వాహకులు ఎం విజయ మోహన్
బొబ్బిలి వేసవి కళ నైపుణ్య శిక్షణ తరగతులకు చిన్నారి పిల్లలు సద్వినియోగము చేసుకోవాలని నిర్వాహకులు ఎం విజయ మోహన్ అన్నారు. పట్టాలోని శ్రీ కళాభారతి ఆధ్వర్యంలో ఈనెల 25వ తేదీ నుంచి జూన్ 5వ తేదీ వరకు వివిధ కళలపై శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. చిన్నారి పిల్లలు తల్లిదండ్రులు శ్రీ కళాభారతి ఆడిటోరియం వద్దకు వచ్చి పేర్లు నమోదు చేసుకొని ఆయన కోరారు.