ప్రొద్దుటూరు: పట్టణంలో పారిశుద్ధ పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ రవిచంద్ర రెడ్డి
Proddatur, YSR | Sep 15, 2025 కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి సోమవారం ఉదయం పట్టణంలోని పారిశుధ్య పరిస్థితులను, అన్న క్యాంటీన్ నిర్వహణను తనిఖీ చేశారు. ఎర్రగుంట్ల రోడ్డులో రోడ్ల శుభ్రతను, సేకరణను పరిశీలించారు. శివాలయం సర్కిల్ వద్ద మడూరు కాలువలో పేరుకుపోయిన వ్యర్థాల తొలగింపును పరిశీలించారు. టీబీ రోడ్డులలోని అన్న క్యాంటీన్ నిర్వహణను తనిఖీ చేశారు. కమిషనర్ వెంట ప్రజారోగ్య శాఖ విభాగం అధికారులు పాల్గొన్నారు.